లోయలో పడ్డ ఆటో..ఒకరి మృతి..

 

నవతెలంగాణ – అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తూ ఆటో లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 17 మంది గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘాట్ రోడ్డు ఎక్కుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. బాధితులంతా సీతంపేట సంత పూర్తి చేసుకొని తిరిగి ఇంటికివెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్ధానికులు లోయలోకి దిగి క్షతగాత్రులను బయటకు తీసి, సీతంపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం, ఆస్పత్రి వద్ద క్షతగాత్రులు, బాధితుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. సీతంపేట పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Spread the love