నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్కనూర్ పట్టణానికి చెందిన ప్యాసింజర్ ఆటో యూనియన్ సభ్యులు గురువారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార టిఆర్ఎస్ పార్టీపై ప్రతి ఒక్కరికి తీవ్ర వ్యతిరేకత ఉందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.