నవతెలంగాణ – హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్కం చెరువు వద్ద వేగంగా వెళ్తున్న ఆటో.. ముందున్న బైక్‌ను తప్పించబోయి పక్కనే ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న రత్నాభాయ్ (43) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ సహా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. దుర్గేశ్వరి అనే మహిళ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మృతురాలి డెడ్ బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.