వైసీపీకి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు జగన్‌కు హాండిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు, పలువురు జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్‌ చైర్మన్లు పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి  అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈమేరకు జగన్‌కు రాజీనామా పత్రాన్ని పంపారు.

Spread the love