నవతెలంగాణ – హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని హైదరాబాద్ తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఈనెల 19 నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. డిశ్చార్జ్ అనంతరం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి తన తల్లిని తీసుకుని ఏఐజీకి వెళ్లారు.