నవతెలంగాణ – ఆర్మూర్
డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన మూడ్ లావణ్య కిక్ బాక్సింగ్ లో తెలంగాణలోనే మొట్ట మొదటి గోల్డ్ మెడల్ సాధించిన సందర్బంగా పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సన్మానం చేసి 10వేల రూపాయలు నగదు ఫౌండేషన్ డైరెక్టర్ సూచరిత రెడ్డి సోమవారం అందజేశారు,ఈ సందర్భంగా సూచరిత రెడ్డి మాట్లాడుతూ లింగ బేధం లేకుండా తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టమైన రంగాల్లో ఉండేలా పోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాము, నారాయణ, సంతోష్ రెడ్డి, చిన్న తదితరులు పాల్గొన్నారు.