స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా అవగాహన

Awareness as part of Swachhtahi Seva programme– ఎంపీడీవో వెంకటేష్ జాదవ్..
నవతెలంగాణ – రెంజల్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా తడి చెత్త పొడి చెత్త పై మహిళలకు అవగాహన కల్పించారు. గురువారం రెంజల్ మండలం సాటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత తో పాటు తడి చెత్త పొడి చెత్తను ఇలా వేరు చేయాలని అంశంపై ఆయన విద్యార్థిని విద్యార్థులకు, మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పాలన అధికారి హెచ్ .శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి మహబూబ్ అలీ, ఉర్దూ మీడియా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాహిర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love