నవతెలంగాణ – చివ్వేంల
వరిని నేరుగా విత్తే పద్ధతి పై రైతులకు అవగాహన సదస్సు బుధవారం ఐటిసీ ఎం ఎస్ కే గ్రీన్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో బీమ్లా తండాలో జరిగింది. బీసీఐ మండల కోఆర్డినేటర్ రాంబాబు మాట్లాడుతూ.. డిఎస్ఆర్ పద్ధతి ద్యారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఆగ్రో మోడల్ లో జామాయిల్ సాగు చేసి రైతు అధిక ఆదాయం లభిస్తుందన్నారు. రైతులు వరి పొలాల గట్ల చుట్టు కూడా జామాయిల్ మొక్కలు పెట్టుకొని ఆదాయం పొందాలని సూచించారు. ఈ గ్రీన్ క్రాస్ సంస్థ మండల కోఆర్డినేటర్ భూక్య వెంకన్న, సర్పంచ్ ధారావత్ హాముడా నాయక్, ఉప సర్పంచ్ బిగోజి, రైతులు ధరావత్ సుందర్, టిక్య, రెడ్డి, బాలాజి, భాస్కర్, వస్రం, భాగ్య తదితరులు పాల్గొన్నారు.