నవతెలంగాణ-కౌటాల
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఐ ముత్యం రమేష్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. అదేవిధంగా మొబైల్ ఫోన్లో మోసపూరితమైన లింకులు పంపిస్తున్నారని ఆ లింకులను ఓపెన్ చేస్తే నష్టపోయే అవకాశం ఉందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాటుపడవద్దని మాదక ద్రవ్యాలకు దూరం ఉండాలని విద్యార్థులకు సూచించాడు. 25 సంవత్సరాలు కష్టపడి చదివితే 75 సంవత్సరాలు జీవితాన్ని సాఫీగా గడపవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఎన్ మధుకర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులున్నారు.