ఇటీవల కాలంలో రోజురోజుకు పెరుగుతున్న రకరకాల సైబర్ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు మద్నూర్ పాత బస్టాండ్ అవరణంలో అలాగే మండలంలోని సలాబత్పూర్ గ్రామంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. మోసాల కోసం రకరకాలుగా ఫోన్ కాల్ వస్తున్న వాటి గురించి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ కాలుకు ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని, పోలీసులు ప్రజలకు తెలియజేశారు. ఎలాంటి సమాచారం అడిగినా ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమంలో ఏఎస్ఐ కానిస్టేబుళ్లు హోంగార్డులు పాల్గొన్నారు.