మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా పోకల నాగయ్య టి.ఎల్. ఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త టీపీటీఎఫ్ అధ్యక్షులు కె.వి.ఆర్ లో ఆధ్వర్యంలో గురువారం రోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేసుకొనుటకు ఉపాధ్యాయులకు, గ్రాడ్యుయేట్స్ కు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్సీ, ఉపాధ్యాయ, పట్టభద్రులతో ఓటరు నమోదు పై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నాగయ్య మాట్లాడుతూ.. గతంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేసుకున్న వారు కూడా మళ్లీ ఖచ్చితంగా ప్రస్తుతం కూడా ఓటర్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు. గత దశాబ్ద కాలంగా నిరుద్యోగ సమస్యలపై, అధ్యాపకుల సమస్యలపై నిరంతరం పోరాడి, అనేక సమస్యలను పరిష్కరించాను. కావున నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇస్తే మీ గొంతుకనై శాసనమండలిలో నా గళం వినిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిఎల్ఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త పోకల నాగయ్య, టి పి టి ఎఫ్ ధర్మారం అధ్యక్షులు కె.వి.ఆర్, పెద్దపల్లి జిల్లా టిఎల్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మామిడి శెట్టి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ రాజు, టిఎల్ఎఫ్ సభ్యులు మద్దునాల మల్లేశం, రత్నాకర్ రెడ్డి, ఆంజయ్య, కుమార్, రాజేష్ తదితర పట్టబద్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.