నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని కేశ్పల్లీ గ్రామ సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం కు ఉమెన్స్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుజాత హాజరై హెచ్ఐవి ఎయిడ్స్ మీద, కిషోర్ బాలికల శిక్షణ గురించి, గృహహింస పైన సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశం కు సంఘ సభ్యులు మరియు గ్రామ సంఘం ప్రతినిధులు , గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఐకెపి కమ్యూనిటీ కోఆర్డినేటర్ దశరథ్, వివో ఏలు హాజరు కావడం జరిగింది.