
అగ్ని ప్రమాదాలు జరిగితే సమాచారం ఇవ్వాలని జన్నారం అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ కోరారు. అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాల సందర్భంగా జన్నారం బస్టాండ్, మార్కెట్ ఏరియా మార్కెట్ ఏరియాలో, తదితర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు వ్యాపారులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సమాచారం అందిస్తే సకాలంలో వచ్చి మంటలను ఆర్పి వేస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు. బస్టాండ్ ఏరియాలో నీటితో విద్యాసాగర్ చేస్తూ మంటలు ఆర్పే పద్ధతులపై ప్రజలకు వివరించారు. అనంతరం బస్టాండ్ తదితర ఏరియాలో వాల్పోస్టర్లను అంటించారు. అన్ని ప్రమాదాలు సంభవించే వెంటనే తమను సంప్రదించాలని కోరారు కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.