ఆశ్రమ పాఠశాలలో ఓటర్ నమోదు పై అవగాహన

నవతెలంగాణ- తాడ్వాయి

మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిరల్ లిటరసీ క్లబ్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ మాట్లాడుతూ ఎలక్ట్రోరల్ లిటరసిక్ క్లబ్ అనేది పాఠశాల విద్యార్థులను వారి ఎన్నికల హక్కులపై అవగాహన కల్పించడానికి మరియు రిజిస్ట్రేషన్ అది ఓటింగ్ యొక్క ఎన్నికల ప్రక్రియలో వారికి పరిచయం చేయడానికి ఆసక్తికరమైన కార్యక్రమం కార్యకలాపాలు మరియు ప్రయోగత్మక అనుభవం ద్వారా వారిని నిమగ్నం చేయడానికి ఒక వేదిక అన్నారు. ఈ ఎల్ సి (ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్) ద్వారా భారత దేశ ఎన్నికల సంఘం యువ మరియు భవిష్యత్ ఓటర్లలో ఎన్నికల భాగస్వామ్య సంస్కృతిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు, అటెండర్ చిట్టిపెళ్లి బిక్షపతి, ఉపాధ్యాయులు ఈసం బుచ్చయ్య తదితర ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love