ధాన్యం ,యోగ పై అవగాహన కార్యక్రమం

నవతెలంగాణ- ఆర్మూర్
బాల్కొండ మండలం బోదే పల్లి గ్రామంలో పి ఎస్ ఎస్ ఎం నవనాథపురం ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు. శ్రీమతి శ్రీ మీసాలఅనిత రాజు దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం, శాఖాహార ర్యాలీ ధ్యాన, కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుమారి ఏంజెల్ స్వాతి మాట్లాడుతూ.. ప్రతిరోజు ప్రతి ఒక్కరు ధ్యానం యోగ చేయాలని ఈ సందర్భంగా ధ్యాన, సహకార విశిష్టతపై వివరించారు.ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం నవనాథపురం కమిటీ సభ్యులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి , తిరుమల గంగారం, కూనింటి, శేఖర్ రెడ్డి ,అమరవాజి శ్రీనివాసు నారాయణ , రాజారాం, నవంపేట్ శ్రీనివాస్ అమృత రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love