నవతెలంగాణ – కంఠేశ్వర్
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్, రైల్వే స్టేషన్, రిలయన్స్ మార్ట్ నియర్ అశోక్ టాకీస్ లలో అగ్నిమాపక అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. సదస్సులో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అదేవిధంగా అన్ని ప్రాంతాలలో అక్కడ పనిచేసే సిబ్బందికి అవగాహన కల్పిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్ రావు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితులలో అగ్ని ప్రమాదాలు జరిగితే 101 నెంబర్ కు ఫోన్ ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలో క్షుణ్ణంగా వివరించారు.