– జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
ఓటరు నమోదులో భాగంగా స్వీప్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్త పట్నా యక్ తెలిపారు. ఐడీవోసీలో ఓటర్ నమోదు లో భాగంగా జిల్లా స్థాయి లో స్కిట్, పాటల పోటీలు, కవిత్వం పై పోటీలలో పాల్గొన్న చిన్నారులకు కలెక్టర్ బహు మతులను ప్రదానం చేసారు. ఈ నెల 19వ తేదీ ఓటరు నమోదుకు చివరి తేదీ అయినందున జిల్లా వ్యాప్తంగా ప్రచారాన్ని పలు కార్యక్రమాల ద్వారా నిర్వ హిస్తూ ఓటరుగా నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఎన్నికల సంఘం వారు స్వీప్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో సృజనాత్మకత, కళాత్మకత విలువల్ని వెలికి తీస్తున్నామన్నారు. బావి భారత సమాజానికి యువత ఒక మైలు రాయి అని, స్వేచ్చాయుత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఇప్పటికే జిల్లాలో అన్ని నియోజక వర్గాలలో ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఓటు ఆవశ్యకత పై ప్రజలలో చ్కెతన్యం కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్వో వై వి గణేష్, డీఈవో అబ్దుల్ హై, నోడల్ అధికారి హరిప్రసాద్ ,జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.