దోమల నివారణపై అవగాహన కలిగించాలి

– మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కేవీ.రమణచారి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
దోమల నివారణ, నిర్మూలనపై ప్రజలకు అవగాహన కలిగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కేవీ.రమణాచారి మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ మలేరియా ఎండమాలజిస్ట్‌ గంగప్ప, మెప్మా సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు నీటి నిలువలలో ఆయిల్‌ బాల్స్‌ విడుదల చేయాలని, మురుగు కాలువలలో దోమల మందు పిచికారి చేయాలని ఆదేశించారు. మెక్మా రిసోర్స్‌ పర్సన్లు వ్యాధులను నివారించేందుకు కషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్లు నాగరాజు, శంకర్‌, శ్రీనివాస్‌, మెప్మా టిఎంసి శ్రీనివాస్‌, పట్టణ మలేరియా సూపర్వైజర్‌, హెల్త్‌ అసిస్టెంట్లు,ఫీల్డ్‌ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love