రేపు సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన 

నవతెలంగాణ – చేర్యాల 
ఆధునిక సాంకేతిక విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేపు(బుధవారం)ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండీ. అఫ్రోజ్ తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం తోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో   ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు,మండల స్థాయి అన్ని  శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.
Spread the love