కోట్ల రూపాయల అక్రమ సంపాదన కొరకు, పేద విద్యార్థులను ఇంజినీరింగ్ విద్యకు దూరం చేస్తూ రూల్స్ కి విరుద్ధంగా ఒక్కో ఇంజనీరింగ్ సీటు ను 16 నుంచి 25 లక్షల రూపాయలకు అమ్ముకుంటూ విద్యా కేంద్రాలలో మాఫియా ను కొన్ని ఇంజనీరింగ్ కలశాలలు కొనసాగిస్తున్నాయి ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకుండా ఈఈఈ ,సివిల్ , కోర్సుల స్థానంలో సిఎస్ఈ అనుబంధ సెక్షన్ల పెంపు కోసం ప్రయత్నిస్తున్నారు.
అటనమస్ పేరుతో విచ్చలవిడిగా ల్యాబ్ ,లైబ్రరీ, ప్లేస్మెంట్ ఫీజులు వసూల్ చేస్తున్నారని , ఎక్సమినేషన్ బ్రాంచ్ ద్వారా అనేక అవకతవకలకు పాల్పడుతున్నట్లు కళాశాలకు అనుబంధంగా హాస్టల్ నిర్వహిస్తూ ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి 2 లక్షల ఫీజు వసూల్ చేస్తున్నారున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు నడిపిస్తూ కాలేజ్ ట్రాన్స్పోర్ట్ పేరిట ముందుగానే విద్యార్థుల నుండి డబ్బులు దండుకుంటున్నారు, కొన్ని కలశాలలు ఏజెన్సీ ల ద్వారా ఫ్యాకల్టీ ని నియమించి జీతాలిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పుడుతున్న ఇంజనీరింగ్ కలశాలల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అటనమస్ వ్యవస్థ ను రద్దు చేయాలని టెక్నికల్ ఎడుకేషనల్ కమిషనర్ ఐఎఎస్ దేవసేన కు శనివారం పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్స్ ఆజాద్, పొగుల చిరంజీవి యాదవ్, భూక్య రవినాయక్, చేవెళ్ల యాదగిరి పాల్గొన్నారు.