చైతన్యపురి సీఐగా బి నాగార్జున..

నవతెలంగాణ- చైతన్యపురి

చైతన్యపురి సీఐగా బి. నాగార్జున బాధ్యతలు స్వీకరించారు. 2009 బ్యాచ్ కు చెందిన నాగార్జున గతంలో మేడ్చల్, వనస్థలిపురం  స్టేషన్ ల లో ఎస్సై గాను సిసిఎస్ లో ఎస్సై, ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో  డిఐగా, రాచకొండ కమిషనర్ పరిధిలోని పీడి యాక్టీసెల్ లో బాధ్యతలు నిర్వహించారు. తాజాగా వనస్థలిపురం ట్రాఫిక్ సిఐ నుండి చైతన్యపురి ఎస్ హెచ్ఓగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో కేసులో బాధితులకు న్యాయం జరిగేలా చేయడంతో పాటు, హయత్ నగర్ లో చెడ్డి గ్యాంగ్ కేసులో నిందితులకు ఏడు సంవత్సరాల శిక్ష పడే విధంగా చేసి మంచి పేరు తెచ్చుకున్న అధికారిగా గుర్తింపు ఉంది.
Spread the love