నవతెలంగాణ – హైదరాబాద్: టీ శాట్(సాఫ్ట్‌నెట్) సీఈవోగా సీనియర్ జర్నలిస్టు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ పదవిలో వేణుగోపాల్ రెడ్డి రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో టీ శాట్ సీఈవోగా సీనియర్ జర్నలిస్టు ఆర్ శైలేష్ రెడ్డి నియామకమైన విషయం తెలిసిందే.