బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను జైల్లో వేయాలి: బాబా రామ్ దేవ్

నవతెలంగాణ – ఢీల్లి: లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ సంస్థ అధినేత బాబా రామ్ దేవ్ మద్దతు పలికారు. భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలో శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండడం తెలిసిందే. దీంతో ఈ అంశంపై మొదటిసారి బాబా రామ్ దేవ్ స్పందించారు. రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ వేధింపులకు వ్యతిరేకంగా, రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టడం సిగ్గు చేటు. అలాంటి వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. తల్లులు, అక్క చెల్లెళ్లు, కుమార్తెల గురించి ప్రతిరోజూ అర్థం పర్థం లేని మాటలు చెబుతుంటాడు’’ అని రామ్ దేవ్ అన్నారు.

Spread the love