నవతెలంగాణ – హైదరాబాద్: విరాట్ కోహ్లీని చూసి పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చాలా నేర్చుకోవాలని ఆ దేశ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్ సూచించారు. ‘బాబర్‌పై చాలా అంచనాలున్నాయి. తన ఫిట్‌నెస్, క్రమశిక్షణపై అతడు దృష్టి సారించాలి. కెప్టెన్సీ చిన్న విషయం. ప్రదర్శనే ముఖ్యం. విరాట్‌ను చూడండి. కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నా బ్యాటింగ్ రికార్డులు బద్దలుగొడుతున్నారు. దేశానికి ఆడటాన్ని ఎంతగా ప్రేమిస్తాడన్నదానికి అదే నిదర్శనం’ అని చెప్పుకొచ్చారు.