బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

నవతెలంగాణ-బాసర
మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ తాలూకా గోదావరి నదిపై ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం ఎత్తి నీటిని కిందికి వదిలారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల ఇంజినీరింగ్‌ అధికారుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి సుమారు ఒక టీఎంసీ నీటిని కిందికి వదిలినట్టు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ అధి కారులు తెలిపారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ఎగ్జి క్యూటివ్‌ ఇంజినీర్‌ చౌగలే, ఇంజినీర్‌ చక్ర పాణి, కె.రవి, ఎస్సారెస్పీ ఏఈ వంశీ పాల్గొన్నారు.

Spread the love