సంయుక్త కార్యదర్శిగా బాబు

– తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం నియామకం
హైదరాబాద్‌: తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం (బీఏటీ) సంయుక్త కార్యదర్శిగా యువీఎన్‌ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు బీఏటీ సంయుక్త కార్యదర్శిగా ఈవెంట్స్‌, ప్రోటోకాల్‌ అంశాలను యువీఎన్‌ బాబు పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ఆగస్టు 16న జరిగిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం తీర్మానం మేరకు యువీఎన్‌ బాబుకు శుక్రవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో బీఏటీ ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్‌ నియామక పత్రం అందజేశారు.

Spread the love