అణగారిన వర్గాల అభివృద్ధి ప్రదాత బాబూ జగ్జీవన్‌రామ్‌

Babu Jagjeevanram was a provider of development for the downtrodden
Babu Jagjeevanram was a provider of development for the downtrodden

నవతెలంగాణ-నేలకొండపల్లి
అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన అభివృద్ధి ప్రదాత బాబు జగ్జీవన్‌రామ్‌ అని కేవీపీఎస్‌ జిల్లా నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్‌రామ్‌ 117వ జయంతి వేడుకలను కేవీపీఎస్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కార్యదర్శి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ మండల నాయకులు పొట్టపింజర పుల్లయ్య, బాబు వేణు, వేసు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, నాగరాజు, నవీన్‌, వినోద్‌, భాస్కర్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని భైరవునిపల్లి గ్రామంలో బాబు జగ్జీవన్‌ రావు 117 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ ఐడియాలజిస్ట్‌ పెద్దపాక వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెదపాక వెంకటేశ్వర్లు, మాతంగి రాజా, కుక్కల వెంకటేశ్వర్లు, రత్నం, గండు సైదులు, బాలబోయిన వెంకటేశ్వర్లు, బచ్చలకూరి వెంకటేశ్వర్లు, జగ్జీవన్‌రామ్‌ యూత్‌ అధ్యక్షుడు ముప్పిడి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం: బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం, తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడీఓసీ కలెక్టరేట్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీవోస్‌ జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రి, బీసీ వెల్ఫేర్‌ అధికారి జ్యోతి, జిల్లా అసోసియేటెడ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌, జిల్లా ట్రెజరర్‌ శేషు, ప్రసాద్‌, జిల్లా నాయకులు నయూమ్‌ పాషా, పీ. వీరస్వామి, జే వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
త్రివేణి పాఠశాలలో….
నగరంలోని త్రివేణి పాఠశాలలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా త్రివేణి పాఠశాల డైరెక్టర్‌ డాక్టర్‌ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్‌ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, పాఠశాల సీఆర్‌ఓ కాట్రగడ్డ మురళీకష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్‌, పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ స్వప్న, ముస్తఫా, అశోక్‌, క్యాంపస్‌ ఇంచార్జ్‌ చార్లెస్‌, సందీప్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి: బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంలోని మంత్రి పొంగులేటి క్యాంప్‌ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి కాంగ్రెస్‌ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు.
ఎర్రుపాలెం: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి డాక్టర్‌ బాబు జగజ్జివన్‌ రామ్‌ను కొనియాడారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు బండారు నరసింహా రావు,కడియం శ్రీనివాసరావు, శీలం శ్రీనివాసరెడ్డి, అను మోలు వెంకటకృష్ణారావు, షేక్‌ ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ : మండల పరిధిలోని తెలగవరం గ్రామంలో శుక్రవారం బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు ఏపూరి వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.
సత్తుపల్లిరూరల్‌: బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి మాజీ ఉపప్రధాని బాబూ జాగ్జీవన్‌ రామ్‌ అని బీజేఆర్‌ కమిటీ అధ్యక్షులు పుల్లారావు అన్నారు. సత్తుపల్లి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ ఎదురు జగ్జీవనరామ్‌ విగ్రహం వద్ద, బీజేఆర్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం బీజేఆర్‌ ఫౌండర్‌ కమిటీ అధ్యక్షులు ఇడుపులపాటి వెంకటేశ్వరరావు విగ్రహానికి గజమాలను వేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ న్యాయ సలహాదారు లాయర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆడమ్స్‌, బీజేఆర్‌ కమిటీ అధ్యక్షులు ఎస్‌.పుల్లారావు, ప్రధానకార్యదర్శి జె.జగన్నాధం, ట్రెజరర్‌ ఐ.నాగేశ్వరరావు, ఎన్‌ బుచ్చయ్య, కె.బాలస్వామి, కేవీపీఎస్‌ పోరాట కమిటీ జిల్లా సభ్యులు సర్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు: జగ్జీవన్‌ రామ్‌ జయంతి శుక్రవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. అడసర్ల పాడులో ఆయన విగ్రహానికి మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మధిర: మధిర మండల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సురంశెట్టి కిషోర్‌ బాబు జగ్జీవన్‌ రావు, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ రంగా హనుమంతరావు, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు దారా బాలరాజు, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్‌, మండల ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు బాణావత్‌ వెంకటరమణ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం: మండల కేంద్రంలో శుక్రవారం కేవీపీఎస్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్జీవన్‌ రావు చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. కేవీపీఎస్‌ మండల అధ్యక్షులు సోమపువ్వు రాము అధ్యక్షతన నిర్వహించిన సభలో పాపిట్ల సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా నాయకులు కొమ్ము శ్రీను, సోమపొంగు రాము, కొమ్ము శంకర్‌, కే. కుటుంబరావు, శ్రీనివాస్‌, ది లోకేష్‌, కే .ఉప్పలయ్య, నాగేశ్వరరావు, రాము తదితరులు పాల్గొన్నారు.

Spread the love