కుందూరు రఘువీరారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: బచ్చలికూరి రామ్ చరణ్

నవతెలంగాణ – చివ్వేంల
వామపక్ష పార్టీలు బలపర్చిన ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి, కుందూరు రఘువీరారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ మండల కార్యదర్శి ఖమ్మంపాటీ రాము, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి  బచ్చలికూరి రామ్ చరణ్ ఓటర్ మహాశయులకు పిలుపునిచ్చారు. శుక్రవారం  చివ్వెంల మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ, సీపీఐ(ఎం), కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ..కేంద్రంలో మతోన్మాద బీజేపీని మోడీని ఓడించాలని, గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, దేశ సంపాదన అంతా కార్పొరేట్ సంస్థలకు  ప్రధాని మోడీ,  ఆదాని, అంబానీలకు  సంపన్న వర్గాలకు, మేలు చేశాడని, కార్మికులకు, కర్షకులకు, నల్ల చట్టాలు తెచ్చి, నట్టేట ముంచాడని, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా యువతను, మోసం చేసిన మతోన్మాద బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, మోడీ ప్రభుత్వం భారతదేశంలో మళ్లీ అధికారంలోకి వస్తే, బడుగు, బలహీనమైన, మైనార్టీ ప్రజల యొక్క రిజర్వేషన్లు, ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి, రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించి, పార్లమెంటుకు పంపించాలని వారు  కోరారు. అలాగే రాష్ట్రంలో మాయమాటలతో, గత పది సంవత్సరాలుగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు రేగటి లింగయ్య, సిరపంగి గామయ్య, నేరేడు వెంకటరత్నం, బోప్పని సులేమాన్, బాబు తదితరులు పాల్గొన్నారు.
Spread the love