అప్పులోడు-చెప్పులోడు-అమెరికావాడు!

జపాన్‌లోని హిరోషిమా నగరంలో మేనెల 19-21 తేదీల్లో జరిగే జి7 శిఖరాగ్ర
సమావేశాల్లో పాల్గొని స్వదేశం చేరుకొని ప్రతిపక్షంతో మంతనాలు జరిపేందుకు బైడెన్‌
నిర్ణయించుకున్నారు. సాధారణంగా ప్రపంచ నేతల పర్యటనలు అనేక అంశాలను
పరిగణనలోకి తీసుకొని ఎంతో ముందుగానే నిర్ణయిస్తారు. అలాంటి బైడెన్‌
యంత్రాంగం రుణ పరిమితి అంశాన్ని, ప్రతిపక్ష పార్టీ ఎత్తుగడను ఎలా
విస్మరించిందన్నది అందరూ సంధిస్తున్న ప్రశ్న. ఇప్పటికే డాలరును పక్కకు నెట్టి చైనా
కరెన్సీని అనేక దేశాలు స్వీకరిస్తున్నాయి. కొన్ని దేశాలు డాలర్లకు బదులు బంగారాన్ని
కొనుగోలు చేసి జాగ్రత్త పడుతున్నాయి. జీతాలు చెల్లించలేక చేతులు ఎత్తేస్తే రేటింగ్‌
తగ్గుతుంది. అన్నింటికీ మించి అమెరికాను లెక్కచేసే వారు ఉండరు.
ఈనెల 24న సిడ్నీలో జరగాల్సిన చైనా వ్యతిరేక అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ కూటమి క్వాడ్‌ (చతుష్టయం) సమావేశాలకు తాను హాజరు కావటం లేదని అమెరికా అధినేత జో బైడెన్‌ చివరి నిమిషంలో చెప్పటంతో అసలా సమావేశాన్నే రద్దు చేస్తున్నట్లు ఆతిధ్య ఆస్ట్రేలియా ప్రకటించింది. దాంతో అక్కడేదో వీర శూర నిర్ణయాలు చేస్తారు, చైనాను కట్టడి చేస్తారని ఎన్నో కలలు గంటూ అమెరికాను నమ్ముకున్న దేశాలు ఆశాభంగం చెందాయి. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదాలని చూసే వారి పరిస్థితిని ఇది గుర్తుకు తెచ్చింది. కూటమిలోని నాలుగు దేశాలూ సమాన భాగస్వాములని చెప్పారు. జరిగిన పరిణామాలను చూస్తే విశ్వగురువుగా, అమెరికాను కూడా కట్టడి చేస్తున్నారని భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటున్న మన ప్రధాని నరేంద్రమోడీతో సహా ఎవరితోనూ సంప్రదింపులు జరిపినట్లు కనపడదు. సమావేశం రద్దైనా మన ప్రధాని నరేంద్రమోడీ సిడ్నీ వెళతారట. పెళ్లి రద్దయినా వండిన వంట వృధా అవుతుంది ఏమనుకోకుండా వచ్చి తిని వెళ్లండి అన్నట్లుగా ఎలాగూ వస్తామన్నారుగా రండి ఏదో ఒకటి మాట్లాడుకుందాం అని ఆతిధ్యం దేశం కోరి ఉండవచ్చు. కొత్తగా చేసుకొనే ఒప్పందాలు, మన దేశానికి ఒరగబెట్టే అంశాలు కూడా ఏమీ లేవు. అలాంటప్పుడు వెళ్లటం ద్వారా మన పరువు సంగతేమిటి అన్నది ప్రశ్న. ఆస్ట్రేలియా వెళుతూ 22వ తేదీన పాపువా న్యూగినియా(పిఎన్‌జి)లో పసిఫిక్‌ సముద్ర దీవుల దేశాల సమావేశంలో పాల్గొనే పర్యటనను కూడా బైడెన్‌ రద్దు చేసుకున్నాడు. సమావేశం సంగతి తరువాత ఆ రోజు తమ ప్రభుత్వం ప్రకటించిన సెలవు రద్దైందే అని పిఎన్‌జి పౌరులు నిట్టూర్పు విడిచి ఉంటారు. వైట్‌ హౌస్‌లో ఎవరు ఉన్నప్పటికీ అమెరికాకు అగ్రస్థానం అన్నదే విధానంగా ఉంటుంది. ఇప్పుడు కూడా జరిగింది. దక్షిణ చైనా సముద్రం, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో చైనా పెత్తనం పెరిగిపోతోంది, దాన్ని అడ్డుకొనేందుకు అందరూ కలవాలన్న అమెరికా పథకంలో మన దేశం కూడా భాగస్వామిగా ఉందన్నది పచ్చినిజం. మన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఏమి చేసినా దాన్ని తప్పుపట్టనవసరం లేదు. కానీ అమెరికా వాడి కోసం మనం అర్రులు చాచటమే తిప్పలు తెస్తోంది. సిడ్నీ సమావేశానికి డుమ్మా కొట్టటానికి రావటం లేదన్న సమాచారం తప్ప దానికి బైడెన్‌ చెప్పిన కారణం ఏమిటో ఎవరు చెప్పరు.
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ రుణపరిమితి 31.4లక్షల కోట్ల డాలర్లు. దాన్ని మించి అసాధారణ పరిస్థితి అనే నిబంధనను సాకుగా చూపి జనవరిలో ఇప్పటికే అప్పులు చేశారు. జూన్‌ ఒకటవ తేదీనాటికి అమెరికా రుణ పరిమితిని ఇంకా పెంచి చేసిన అప్పులకు లేదా కొత్త అప్పులకు పార్లమెంటు అనుమతి ఇవ్వకపోతే ఆ రోజున చెల్లించాల్సి ప్రభుత్వ, మిలిటరీ సిబ్బంది వేతనాలు, పెన్షన్లు ఖాతాల్లో పడవు. అదే జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రభుత్వ పరువు గంగలో కలుస్తుంది. గడచిన 63సంవత్సరాల్లో 78సార్లు అమెరికా పార్లమెంటు రుణపరిమితి ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీగా ఉన్న ప్రతిపక్ష రిపబ్లికన్లు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్లను దెబ్బతీసేందుకు రుణ పరిమితిని ఆయుధంగా చేసుకొనేందుకు చూస్తున్నారని, ఈ సారి గతం మాదిరి అమోదముద్ర పడదని బైడెన్‌కు తెలుసు. చతుష్టయం, ఇతర సమావేశాలు, సభల పేరుతో ఊరేగుతూ ఉంటే జూన్‌ ఒకటి గడువులోగా ప్రతిపక్షాన్ని బతిమిలాడుకోకపోతే పరువు దక్కదు. అందువలన ఒక్క రోజు ఆలస్యం చేసినా కుదరదని అర్థమైంది. జపాన్‌లోని హిరోషిమా నగరంలో మేనెల 19-21 తేదీల్లో జరిగే జి7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొని స్వదేశం చేరుకొని ప్రతిపక్షంతో మంతనాలు జరిపేందుకు బైడెన్‌ నిర్ణయించుకున్నారు. సాధారణంగా ప్రపంచ నేతల పర్యటనలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంతో ముందుగానే నిర్ణయిస్తారు. అలాంటి బైడెన్‌ యంత్రాంగం రుణ పరిమితి అంశాన్ని, ప్రతిపక్ష పార్టీ ఎత్తుగడను ఎలా విస్మరించిందన్నది అందరూ సంధిస్తున్న ప్రశ్న. ఇప్పటికే డాలరును పక్కకు నెట్టి చైనా కరెన్సీని అనేక దేశాలు స్వీకరిస్తున్నాయి. కొన్ని దేశాలు డాలర్లకు బదులు బంగారాన్ని కొనుగోలు చేసి జాగ్రత్త పడుతున్నాయి. జీతాలు చెల్లించలేక చేతులు ఎత్తేస్తే రేటింగ్‌ తగ్గుతుంది. అన్నింటికీ మించి అమెరికాను లెక్కచేసే వారు ఉండరు.
అప్పులోడు చెప్పులోడి వెంట వెళ్ల కూడదన్నది ఒక లోకోక్తి. అప్పులిచ్చిన వారు ఎక్కడబడితే అక్కడ నిలవేస్తారు గనుక వారిని తప్పించుకొనేందుకు అప్పులోడు వెంట ఉన్నవారిని ఎటువైపు తీసుకువెళతాడో చెప్పలేం. చెప్పులోడు తాను ఎటునడిచినా ఏమీ కాదు గనుక ముళ్ల, మీద రాళ్ల మీద తాను నడుస్తూ వెంట ఉన్నవారిని ఇబ్బంది పెడతాడు. తాజాపరిణామంతో అమెరికా వెనుక నడుస్తున్నవారి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. మామ చివాట్లు వేసినందుకు కాదు తోడల్లుడు తొంగిచూసినందుకు అన్నట్లుగా సిడ్నీ సమావేశానికి డుమ్మా కొట్టి ఉపగ్రహాలను నిరాశకు గురిచేసిన జో బైడెన్‌ను ఏమీ అనలేక చతుష్టయ సమావేశ రద్దు గురించి చైనా తనకు అనుకూల ప్రచారం చేసుకుంటుంది కదా! అని అనేక మంది వాపోతున్నారు. ప్రపంచ రాజకీయాలు, విదేశాంగ విధానాల్లో స్వతంత్ర వైఖరికి బదులు ఒక దేశం అందునా ఎక్కడ వదిలి వేస్తుందో తెలియని అమెరికా తోకపట్టుకుపోతే ఇలాగే ఉంటుంది.

Spread the love