– అగ్ని ప్రమాదంలో 56 మంది మృతి
హనోరు : వియత్నాం రాజధాని హనోరులో 9 అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 56మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు వున్నారు. మరో 37మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా తెలిపింది. మృతి చెందిన వారిలో 39మందిని గుర్తించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ వియత్నాం న్యూస్ బుధవారం సాయంత్రం తెలిపింది. గాయపడిన వారిని, మరణించిన వారిని వేర్వేరు ఆస్పత్రులకు తీసుకెళ్లడంతో మృతుల సంఖ్య స్పష్టం కాలేదు. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. ఆ భవనానికి ఎమర్జన్సీ మార్గం లేదు. దాంతో ఆ భవనంలో చిక్కుకున్నవారు బయటపడడం చాలా కష్టమైంది. ఉదయానికి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగలిగారు.