ఆర్సీబీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..

నవతెలంగాణ – బెంగళూరు: ఈ నెల 18న చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తాజా నివేదిక ప్రకారం ఆ రోజు ఉదయం, సాయంత్రం బెంగళూరులో వర్షం పడే ఛాన్స్ 45, 42 శాతంగా ఉంది. ఈ మ్యాచ్ సమయంలో జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. సీఎస్కే నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.

Spread the love