నవతెలంగాణ – అమరావతి: ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. విజయవాడ సెక్షన్‌లో భద్రతా నిర్మాణ పనులు చేపడుతుండటంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్ (17219) ఈనెల 16 నుంచి 22 వరకు.. విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17220)ను 17 నుంచి 23 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. అలాగే విశాఖ-విజయవాడ-విశాఖ మధ్య నడిచే 22701, 22702 నంబర్లు గల ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అక్టోబరు 16, 17, 18, 20, 21 తేదీల్లో రద్దు చేశారు. అలాగే ధన్‌బాద్-అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్ (13351) ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు.. 16న హటియా-ఎర్నాకులం ఏసీ ఎక్స్‌ప్రెస్ (22837), 15, 17 తేదీల్లో హటియా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12835), 18న జసిదిహ్-తంబరం ఎక్స్‌ప్రెస్ (12376), 19న టాటా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (18111), 20న టాటానగర్-బెంగళూరు (12889) రైళ్లను దారి మళ్లించారు. ఈ రైళ్లు వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తాయని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచించారు.