మండలంలో బడిబాట కార్యక్రమం..

నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని రాయపర్తి, తిర్మలాయపల్లి, కొత్తూరు, కొండూరు, వివిధ గ్రామాల్లో గురువారం మన ఊరు మన బడి పథకంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా విచ్చేసిన ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ మాట్లాడుతూ మన ఊరు మనబడి పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందాయని తెలిపారు. గ్రామాల్లో ఉండే పిల్లలు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఐత రామ్ చందర్, ప్రధానోపాధ్యాయులు గారె కృషమూర్తి, పద్మాలత తదితరులు పాల్గొన్నారు.
Spread the love