సీఎంను కలిసిన బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌

సీఎంను కలిసిన బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ అకాడమీ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పూనుకోవడం శుభ పరిణామని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు.

Spread the love