బహుజన సమాజ్ పార్టీ  మండల అధ్యక్షులు గుద్దేటి మధుసూదన్ రాజీనామా

నవతెలంగాణ- చివ్వేంల: చివ్వేంల మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చివ్వేంల మండల బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గా రాజీనామా చేస్తున్నట్లు గుద్దేటి మధుసూదన్ ప్రకటించారు. బహుజన వాద సిద్ధాంతాల ఆకర్షణ కు గురై  బహుజన వాద సిద్ధాంతం పై గౌరవం తో  గత రెండు సంవత్సరల క్రితం బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్  ప్రవీణ్ కుమార్  సమక్షంలో  పార్టీ లో చేరి,  పార్టీ నిర్మాణం కోసం కృషి చేసానని, తన సేవలు గుర్తించిన నాటి జిల్లా కమిటీ  తేదీ 27-09-2022 న మండల కమిటీ అధ్యక్షులు గా  ఎన్నిక జరిగిందని తెలిపారు. కానీ గత రెండు నెలలు గా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో బహుజన వాద సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని  అన్నారు. దీనితో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Spread the love