బహుజన సమాజ్ పార్టీ అర్బన్ నియోజకవర్గంలో గడపగడపకు ఆర్ఎస్పి కార్యక్రమం

నవతెలంగాణ- కంటేశ్వర్ 

బహుజన సమాజ్ పార్టీ అర్బన్ నియోజక వర్గంలో డివిజన్ నెంబర్ 39 లోని అంబేద్కర్ నగర్, ఓల్డ్ యెన్ జి ఓ కాలనీ లో గడప గడపకు బహుజన సమాజ్ పార్టీ ప్రగతి భవన్ కు ఆర్.ఎస్ .పి అనే కార్యక్రమం 7 వ రోజున శుక్రవారంం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వారి కష్టాలను బహుజన్ సమాజ్ ప్రతినిధులకు చెప్పుకోవడం జరిగింది.జనాభాలో 85 % ఉన్న బహుజనులకు రాజకీయ ప్రాతినిధ్యం భాగస్వామ్యం కల్పించడం లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు, ఇండ్లు లేక ఉద్యోగాలు లేక పెన్షన్స్ లేక డ్రైనేజీలు లేక వర్షం పడితే వర్షపు నీరంతా ఇంట్లోకి రావడం, గురించి ప్రజలు అల్లాడిపోతున్నారు.నడవ డానికి రోడ్లు సరిగా లేక ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. వారి కష్టాలు వర్ణనాతీతం. మా కష్టాలు ఎవరికీ చెప్పుకోక అలసిపోయామని చెబుతున్నారు కావున రెండు మూడు నెలల్లో ప్రభుత్వం మారబోతుంది. ప్రవీణ్ రావాలి, పాలనా మారాలి అని ప్రజలు నమ్ముతున్నారు. ఈ కార్యక్రమం లో నిజామాబాదు అర్బన్ నియోజక వర్గ ఇంచార్జి నీరడి లక్ష్మణ్ నాయకత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముస్లిం కన్వీనర్  జాఫర్, వినాయత్, ఉపాధ్యక్షుడు షకీల్ అహ్మద్ , ప్రధాన కార్యదర్శి ఓ.శ్యామ్, ఆర్గనైజర్ సెక్రటరీ మల్లేష్, అరుణ్, గంగాధర్ యాదవ్, రమేష్, మహిళా కన్వీనర్  వి. శృతి లు పాల్గొన్నారు.
Spread the love