ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. రూ. లక్ష పూచీకత్తుతో ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన తిహార్ జైలు నుంచి రేపు (శుక్రవారం) విడుదలయ్యే అవకాశం ఉంది.లిక్కర్ స్కామ్లో ఆయన లంచం తీసుకున్నారని ఈడీ కేజీవాల్ పై ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Spread the love