రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణకు బెయిల్‌

నవతెలంగాణ – హైదరాబాద్: రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 25న శివ బాలకృష్ణ అరెస్టయిన విషయం తెలిసిందే. నిర్ణీత 60 రోజుల్లో ఛార్జిషీట్‌ వేయకపోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్‌ ఇచ్చింది. రూ.లక్ష, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివబాలకృష్ణకు ఆదేశించింది. ఆయన సోదరుడు శివ నవీన్‌కు సైతం బెయిల్‌ను ఇచ్చింది. ఇంతకు ముందు శివబాలకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Spread the love