భక్తి, త్యాగం, సహనానికి ప్రతీక బక్రీద్ : మంత్రి శ్రీధర్ బాబు

– ముస్లీంలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
నవతెలంగాణ – మల్హర్ రావు
బక్రీద్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముస్లింలకు సోమవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. భక్తి, త్యాగం, సహనం, దాతృత్వం అనే సుగుణాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అల్లా పై విశ్వాసంతో జీవిస్తే అంతా మంచే జరుగుతుందనడానికి తండ్రీకొడుకులైన హజరత్ ఇబ్రహీం, ఇస్మాయిల్ ల జీవిత చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని వెల్లడించారు. ఉన్నదాంట్లో ఇతరులకు పంచిపెట్టమని బక్రీద్ పండుగ అందించే స్ఫూర్తి గొప్పదన్నారు. భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకోవాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. అల్లా దయ మంథని నియోజకవర్గంతోపాటు ఈ రాష్ట్ర ప్రజల పై ఉండాలని మంత్రి దుద్దిళ్ల ఆకాంక్షించారు.
Spread the love