నవతెలంగాణ – హైదరాబాద్ : సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కి రూ.50 లక్షల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. తన బాధ్యతగా బాధిత ప్రజలకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు జూ.ఎన్టీఆర్, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ తమ వంతుగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.