నా సినిమాలకు నా సినిమాలే పోటీ : బాలకృష్ణ

To my movies My movies are the competition: Balakrishnaబాలకష్ణ ‘భగవంత్‌ కేసరి’ చిత్రం బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్‌ కా షేర్‌గా నిలిచింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా, శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ ద్వారా దసరా కానుకగా అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకుని అఖండ విజయం సాధించింది.
రికార్డ్‌ బ్రేకింగ్‌ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ బాక్సాఫీస్‌ కా షేర్‌ సెలబ్రేషన్‌ని ఘనంగా నిర్వహించింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని చిత్ర బందానికి షీల్డ్స్‌ అందించారు. అంబికా కష్ణ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.
బాలకష్ణ మాట్లాడుతూ,’మూడు తరాల ప్రేక్షకులు మెచ్చు కుంటున్నారు, అభినందిస్తు న్నారంటే అది నా పూర్వజన్మ సుకతంగా భావిస్తున్నాను. మంచి కథలను పరిచయం చేస్తే విజయం తప్పక వరిస్తుందనడానికి ఈ సినిమా ఓ నిదర్శనం. నా సినిమాలతో నా సినిమాలకే పోటీ. ఒక మంచి సందేశం చెప్పాలంటే సినిమానే గొప్ప మాధ్యమం. ఇది భాద్యతగా భావించి వెంటనే ఈ కథని ఒప్పుకున్నాను. ఈ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమా త్వరలో హిందీలో రాబోతుంది. హిందీలో కూడా మొట్టమొదటి సారి డబ్బింగ్‌ చెప్పాను. హిందీపై తెలుగు వారికి ఉన్న భాషా పటిమ, సత్తా ఏమిటో ఈ చిత్రం తప్పకుండా నిరూపిస్తుంది. అందులో సందేహమే లేదు’ అని తెలిపారు.
‘భగవంత్‌ కేసరి’ దీపావళి చిచ్చుబుడ్డిలా వెలుగుతూనే ఉంది. అన్నీ థియేటర్స్‌లో ఇంకా సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతూనే ఉంటుంది. ఆ వెలుగు నిర్మాతల కళ్ళలో కనిపిస్తోంది. బాలయ్యకి కాలాలతో సంబంధం లేదు. ఏ కాలంలోలైన జై బాలయ్య నినాదం ఓకే మంత్రంలా వినిపిస్తుంది. బాలయ్య విజయపతాకం ఎప్పుడూ ఇలా ఎగురుతూనే ఉండాలి’ అని కె.రాఘవేంద్రరావు అన్నారు.
‘భగవంత్‌ కేసరి’ వన్‌ ఇయర్‌ జర్నీ. ఈ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అద్భుత విజయంతో షీల్డ్స్‌ ప్రజెంట్‌ చేయడం ఆనందంగా ఉంది.
– దర్శకుడు అనిల్‌ రావిపూడి
ఈ సినిమాకి ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, బాలయ్య ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. ఈ విజయం మాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.
– నిర్మాతలు
సాహూ గారపాటి, హరీష్‌ పెద్ది

Spread the love