అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ

నవతెలంగాణ- అమరావతి: నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పాడు. కాసేపటి క్రితమే మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.  మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయిన కాసేపటికే రచ్చ మొదలైంది.. తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఏపీ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు. అనంతరం వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు పట్టారు. అలాగే.. చంద్రబాబు అరెస్ట్‌ ను నిరసిస్తూటీడీపీ ఎమ్మెల్యే లు అసెంబ్లీ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పాడు. మీ అంతు చూస్తామని బాలయ్య హెచ్చరించాడట. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పడంపై అంబటి కౌంటర్‌ ఇచ్చారు. దమ్ముంటే రా అంటూ అంబటి రాంబాబు సవాల్‌ విసిరారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు.

Spread the love