తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, హుక్కాపై నిషేదం..అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, హుక్కాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేదం విధిస్తూ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ ముందుకు బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లుకు శాసన సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండానే హుక్కా పార్లర్ల నిషేద బిల్లుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తరుఫున మంత్రి శ్రీధర్ బాబు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Spread the love