దారుణం: నిద్రిస్తున్న భార్యపై బండరాయి మోది హత్య

నవతెలంగాణ -హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. బండరాయి తలపై మోది భార్యను దారుణంగా ఓ కసాయి భర్త హతమార్చాడు. అమృత్ సాహు, కవిత దంపతులు గత కొంతకాలంగా మైలార్‌దేవ్‌పల్లిలో జీవిస్తున్నారు. భార్య కవితపై అనుమానం పెంచుకున్న అమృత్ సాహు.. ఆమె నిద్రిస్తుండగా… తలపై బండరాయితో కొట్టాడు. దీంతో కవిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కవిత వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతోనే ఈ హత్య చేసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని అమృత్ సాహుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Spread the love