– ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల పూజలు
నవతెలంగాణ-ఇంద్రవెల్లి
నాగోబా జలాభిషేకం కోసం పవిత్ర గంగాజలంతో తిరుగు పయనమైన మెస్రం వంశీయులు ఖటోడ కోసు, హన్మంతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. వారితోపాటు మెస్రం వంశీయుల కుటుంబ సభ్యులు బండెనక బండి కట్టి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద వారి ఆచార సంప్రదాయం ప్రకారం నవధాన్యాలతో కూడిన నైవేధ్యం సమర్పించారు. ఇంద్రాదేవికి పూజల అనంతరం ఆలయం ఆవరణలో ఉన్న పెర్సాపెన్‌కు ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం మహిళలు ఇంద్రాదేవి ఆవరణలో ప్రత్యేక గారెలు చేశారు. ఈ గారెలతో ఇంద్రాదేవికు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే వంటలను చేసి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం సాయంత్రం బండెనక బండి కట్టి కేస్లాపూర్‌కు పయనమయ్యారు. అక్కడ నాగోబా పూజకు తెచ్చిన కలశాన్ని చెట్టు మీద భద్రపరిచారు. నాగోబా పూజ అయ్యే వరకు మర్రి చెట్టు వద్దనే బస చేస్తారు.