బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి : ఐద్వా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలు అనుచితంగా సంస్కారహీనంగా ఉన్నాయనీ, ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్‌ అరుణజ్యోతి, మల్లులక్ష్మి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఇంగిత జ్ఞానంతో చేయాలని హితవుపలికారు. మహిళలంటే ఆ పార్టీకి చులకన భావం ఉన్నదనీ, అందుకే సంజరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలనీ, లేదంటే తగిన విధంగా మహిళలు బుద్దిచెబుతారని హెచ్చరించారు.

Spread the love