నవతెలంగాణ కరీంనగర్: తాను కేటీఆర్ ను తిడితే మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎందుకు కోపం వస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ మనసులోని మాటలే పొన్నం ప్రభాకర నోటి వచ్చాయని ఎద్దేవా చేశారు. పొన్నం ప్రభాకర్ ఎవరు చెబితే కరీంనగర్ ను వదిలి హుస్నాబాద్ పారిపోయారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తాను నిర్మాణాత్మకంగా సలహా ఇస్తుంటే వ్యక్తిగత దూషణలు చేయడం ఈ ప్రభుత్సవానికి మంచిదికాదన్నారు. తను ఓపికను పరీక్షించొద్దని హెచ్చరించారు. ఆదివారం కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజారుల వేద మంత్రోచ్ఛారణలు, ఆశీర్వాదలయాలో ఆలయంలోకి అడుగుపెట్టిన బండి సంజయ్ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.