సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ…

నవతెలంగాణ – హైదరాబాద్: ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ‘‘ఓఆర్ఆర్’’ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన మీరు ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. మీ మౌనం ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తున్నాయన్నారు. ఓఆర్‌ఆర్‌ టెండర్‌ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. టోల్ టెండర్‌లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులతో బెదిరించడం సిగ్గుచేటన్నారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటి? అని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్‌ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మీకు ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణయే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

Spread the love