ఈ రోజు రాత్రి ఎల్బీ స్టేడియంలో పడుకుంటా: బండ్ల గణేష్

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ రోజు రాత్రి LB స్టేడియంలో పడుకుంటానని పేర్కొన్నారు నిర్మాత బండ్ల గణేష్. రేవంత్‌ రెడ్డడి ప్రమాణా స్వీకారోత్సవం తొమ్మిదో తేదీ అని చెప్పారు.. భయపడ్డా.. కాని ఏడవ తేదీ అని చెప్పడంతో సంతోషించానని తెలిపారు. ఇక్కడే పడుకోమంటే పడుకుంటా.. ఏడవ తేదీ కలిసొచ్చిందని వివరించారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం నా కల అని తెలిపారు.  నేను చెప్పినట్లుగా జరుగుతున్నందుకు ఆనందంగా ఉందని వివరించారు. తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండును కాని, ఏర్పాట్లు చూసుకుంటాని ప్రకటన చేశారు.

Spread the love