రేవ్ పార్టీ కేసు.. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన హేమ

నవతెలంగాణ – హైదరాబాద్ : వైరల్ ఫీవర్ కారణంగా రేవ్ పార్టీ కేసులో విచారణకు హజరయ్యేందుకు గడువు కావాలని నటి హేమ సీసీబీ పోలీసులను కోరారు. ఆమె లేఖను సీసీబీ పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. దీంతో మరోసారి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో సంచలనం రేపిన రేవ్ పార్టీలో దాదాపు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 86 మందిని డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించి, విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

Spread the love